32 శాతం లోటు | - | Sakshi
Sakshi News home page

32 శాతం లోటు

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

● నేటితో ముగియనున్న వానాకాలం ● 20 మండలాల్లో వర్షాభావమే ● సుదీర్ఘ పొడి వాతావరణం ● జిల్లాపై ఎల్‌నినో ప్రభావం

జిల్లాలో ఈ సీజన్‌ వర్షపాతం తీరు

సాక్షి,ఆదిలాబాద్‌: జూన్‌, జూలై ప్రారంభంలో కురి సిన వర్షాలు సాధారణంగా ఉన్నప్పటికీ మిగతా రో జుల్లో సుదీర్ఘ పొడి వాతావరణం (డ్రై స్పెల్‌) చోటు చేసుకుంది. ఆగస్టులో అత్యంత తీవ్రమైన లోటు వర్షపాతం సుమారు 74 శాతం నమోదైంది. సెప్టెంబర్‌ చివరిలో కొన్ని ప్రాంతాల్లో అల్పపీడనం, వాయుగుండం కారణంగా మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ ఊరటనివ్వలేక పోయాయి. సీజన్‌ లోటును పూడ్చలేకపోయాయి. ఎల్‌నినో ప్రభావం జిల్లాపై స్పష్టంగా కనిపించింది. ఏకంగా 32 శాతం లోటు ఈ సీజన్‌లో నమోదైంది. గడిచిన నాలుగేళ్లుగా జిల్లాలో సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైన విషయం తెలిసిందే. ఈఏడాది మాత్రం వర్షాభావం అతలాకుతలం చేసింది.

ఇది పరిస్థితి..

భారత వాతావరణ శాఖ వానాకాలం సీజన్‌ మొదలు నుంచి చివరి వరకు ప్రతీ వారం వర్షపాతాన్ని అంచనా వేస్తుంది. ఈ నాలుగు నెలల్లో 18 వారాలను అంచనా వేయగా, అందులో 8 వారాలు అతి తీవ్ర వర్షాభావం, మూడు వారాలు వర్షాభావం నమోదైంది. ఈ లెక్కన 11 వారాలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. కేవలం ఒకే ఒక్క వారం జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ ఆగస్టు చివరికి వచ్చేసరికి ఏకంగా 74 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇక నాలుగు వారాలు సాధారణ, రెండు వారాలు అధిక వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement