నిరంతర సాధనతోనే విజయాలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర సాధనతోనే విజయాలు

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

ఆదిలాబాద్‌: నిరంతర సాధనతోనే క్రీడల్లో విజయాలు సాధ్యమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలోని జూడో హాలులో మంగళవారం ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14, 17 బాలబాలికల జోనల్‌ స్థాయి జూడో ఎంపిక పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, డీవైఎస్‌వో దయానందరెడ్డి, ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ ఆడే రామేశ్వర్‌, జూడో కోచ్‌ రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement