కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించేలా ఽప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ఆయన వినతులను సంబంధిత అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, డీఆర్వో స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 55 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన ..


