ఆదిలాబాద్‌టౌన్: రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందిస్తామని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. సోమవారం రాత్రి రిమ్స్‌లో తనిఖీలు ని ర్వహించారు. ప్రసూతి,ఆర్థో,ఎమర్జెన్సీ,చిల్డ్రన్, ట్రామా తదితర వార్డులను పరిశీలించారు. రో గులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. గైనిక్, పిల్లల విభాగంలో వైద్యుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు. విధుల్లో ఉండే వైద్యుల కోసం బయోమెట్రిక్, ఫేషియల్, మీ ప్రణామ్ అటెండెన్స్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విధులు విస్మరించే వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల విడుదలైన నిధులకు సంబంధించి అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న 9 మంది చిన్నారులు, స్టాఫ్‌నర్సు ఆరోగ్యం మెరు గ్గా ఉందన్నారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తదితరులున్నారు.


