గుడిహత్నూర్: అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని ఎంపీ గోడం నగేష్ అన్నారు. అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం అంగన్‌వాడీలు, ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యం, వారి భవిష్యత్తు కోసం విశేష కృషి చేస్తోందన్నారు. ఈ కృషిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను పీఎం మోదీ ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తె లుపుతున్నారని పేర్కొన్నారు. అనంతరం అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జాదవ్ సుమన్, నాయకులు గణేశ్ పటేల్, లక్ష్మణ్, జీవీ రమణ, రమేశ్‌జాదవ్, మాధవ్, సిద్ధార్థ్, ఉప సర్పంచ్ నిఖిల్, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
జైనథ్‌లో.
జైనథ్: మండల కేంద్రంలోని రైతు వేదికలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్ మిలన్ నిర్వహించారు. ఎంపీ నగేష్ పాల్గొని అంగన్‌వాడీ, ఆశావర్కర్లను సత్కరించారు. బీజేపీ నాయకులు రమేశ్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, సూర్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


