ఆదిలాబాద్: క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని డీవైఎస్‌వో దయానంద్‌రెడ్డి అన్నా రు. 20వ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి ఎంపిక పోటీలను సోమవారం ఐపీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డిభోజారెడ్డి మాట్లాడుతూ, ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. కాగా, జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో అండర్–14, అండర్–16 బాలబాలికల విభాగాల్లో 300 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పిట్ల రాజేశ్, వెయిట్‌లిఫ్టింగ్ సెక్రెటరీ వీజీఎస్ జ్యోతీశ్వరన్, వీజీఎస్ అకాడమీ చైర్మన్ వీజీఎస్ రాకేశ్, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


