రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

ఇంద్రవెల్లి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. సాక్షులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మగూడ గ్రామానికి చెందిన కొడప జంగు(35) అదే గ్రామానికి చెందిన చహకటి ఇంద్రుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంద్రవెల్లి నుంచి గ్రామానికి వస్తుండగా సమాక గ్రామానికి చెందిన కుంర సంతోష్‌, అదే గ్రామానికి చెందిన సెడ్మకి సాయినాథ్‌తో కలిసి ఇంద్రవెల్లి వైపు వెళ్తున్నారు. మిఠల్‌ జిన్నింగ్‌ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా కొడప జంగుకు తీవ్ర గాయాలై 108 అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మిగితా ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా రిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు 108 ఈఎంటీ సంతోష్‌, పైలెట్‌ రాజ్‌కుమార్‌లు తెలిపారు. మృతుడికి భార్య యేసోదబాయితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement