ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలి

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలోని ఆదివాసీ గ్రామాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీలు, గిరిజన రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, జిల్లా కార్యదర్శి తొడసం శంభు హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆదివాసీ గూడాలలో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, ఇళ్ల సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్‌ జోన్‌ పేరిట ఆదివాసీలను వేధింపులకు గురిచేయకూడదన్నారు. పోడు భూములకు పట్టాలు, హక్కు పత్రాలు ఉన్న రైతులకు త్రీ ఫేజ్‌ కరెంట్‌ కోసం ఫారెస్ట్‌ అనుమతులు వెంటనే మంజూరు చేయాలన్నారు. అన్ని గిరిజన గూడాలకు మంచినీరు, రోడ్లు, ఇందిరమ్మ/డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం సమర్పించారు. టీఏజీఎస్‌ నాయకులు పెంద్రం దత్తురామ్‌, పంద్రం దేవరావు, తొడసం కాశీనాథ్‌, పెందురు రవి, ఆత్రం నాగోరావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement