పాఠశాల స్టోర్‌రూంలో మంటలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాల స్టోర్‌రూంలో మంటలు

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

లక్ష్మణచాంద: సోన్‌ మండలంలోని న్యూ బొప్పారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని స్టోర్‌ రూంలో మంటలు చెలరేగాయి. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో పాఠశాలలోని స్టోర్‌ రూంలో చెత్తకు ఆకస్మాత్తుగా నిప్పంటుకొని మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో గమనించిన చుట్టు పక్కల వారు సర్పంచ్‌ నరేశ్‌కు సమాచారం అందించారు. వెంటనే సర్పంచ్‌ నరేశ్‌ ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. నిర్మల్‌ ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. స్టోర్‌ రూంలో రూ.15000 వరకు ఆస్తి నష్టం జరిగిందని, పక్క గదిలోని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ పరికరాలు కాలిపోయినట్లు సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement