లక్డీకాపూల్: ఆదిలాబాద్ రిమ్స్ ఘటనలో బాధిత చిన్నారులను కాపాడిన నర్సు ప్రమీలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజీవ్ తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమెను సోమవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జెడ్పీ చైర్మన్లు తుల ఉమ, బిందులతో కలిసి ఆయన పరామర్శించారు. రిమ్స్ హాస్పిటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి 27 మంది చిన్నారులలో చాలా మందిని కాపాడిన ప్రమీలను అభినందించారు. పార్టీ తరుపున అన్నివిధాల అండగా ఉంటామని బాధిత కుటుంబసభ్యులకు భరోసా కల్పించామన్నారు. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీశ్, నాయకులు హరిబాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.


