ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూములు కోల్పోతు న్న రైతులకు న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ కా ర్యాలయంలో నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఇండస్ట్రీయల్ కారిడార్ పేరిట వేలాది ఎకరాల భూములను సేకరించే ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. బాధిత రైతులకు వారు కోరుతున్న పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ ఆధ్వర్యంలో రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రిమ్స్‌లో సిబ్బంది కొరతను పరిష్కరించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లేశ్, కార్యదర్శివర్గ సభ్యులు రాఘవులు, సచిన్, కిరణ్, ఆశన్న, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, కిష్టన్న, విష్ణు, ఎన్.స్వామి పాల్గొన్నారు.


