ఎయిర్‌పోర్టు ఏర్పాటులో..
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా చ ర్యలు చేపట్టింది. కేంద్ర రక్షణ, పౌర విమానయాన శాఖల నుంచి ముగ్గురు ప్రత్యేక నోడల్ అధికారుల ను నియమించింది. ఆయా శాఖల సమన్వయంతో భూసేకరణ, సాంకేతిక అనుమతులు, డీపీఆర్, మాస్టర్ ప్లాన్ వంటి కీలక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మరింత వేగవంతం కానుంది. ఈ నిర్ణయంపై ఉమ్మడి జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లావాసుల విమాన రవాణా కలను సాకా రం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు నిర్ణయించాయి. దీనిపై ఈ నెల 13న కేంద్ర రక్షణశాఖ, పౌర విమానయాన శాఖ మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భారతీయ విమానయాన ప్రాథికార సంస్థ (ఏఏఐ)సభ్యుడు(ప్లానింగ్) అనిల్‌గుప్తా ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుకు లేఖ రాశారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ప్రయాణికుల టెర్మినల్, కార్గో, ఎంఆర్‌వో, హ్యంగర్ వంటి సదుపాయాల ఏర్పాట్లపై తగు చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అలాగే ఎయిర్‌పోర్టు రన్‌వే ఖరారు చేసేందుకు రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం నిర్వహించింది. ఇందులో చర్చించిన అంఽశాలు, తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఆయా శాఖలను సమన్వయం చేస్తూ ప్రత్యేక నోడల్ అధికారులను నియమించింది.


