అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

నార్నూర్‌: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. నార్నూర్‌ మండలం జామ్‌డా, బాలన్‌పూర్‌ గ్రామాల్లో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం ప్రారంభించారు. జామ్‌డాలో పంచా యతీ నూతన భవనంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. మరో లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసి, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపికై న లబ్ధిదారులకు భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్‌ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. బాలన్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో హౌసింగ్‌ పీడీ శంకర్‌, డీఈ షకీర్‌, ఏఈ రాకేశ్‌, తహసీల్దార్‌ రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు, సర్పంచులు చందర్శావ్‌, సంగీత, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement