ఆదిలాబాద్‌రూరల్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలు మరువలేనివని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గు రువారం ఆమె వర్ధంతిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఎదుటగల ఆమె విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వే సి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నా రు. ఐలమ్మ అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు తదితరులు పాల్గొన్నారు.


