ఆదిలాబాద్‌టౌన్: పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.18లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లను ప్రత్యేక బృందం ద్వారా రికవరీ చేయగా పోలీ స్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. ఏడాదిన్నర కాలంలో సుమారు 1,700 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వివరించారు. మొబైల్ ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తె లిపారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ నాగరాజు, ఆర్‌ఎస్సై గోపీకృష్ణ, మజీద్, అన్వేశ్, నవనీత్, జుబేర్, ఎజాజ్ తదితరులున్నారు.


