ఆదిలాబాద్‌టౌన్: ఫీజురీయింబర్స్‌మెంట్ బకా యిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చేపట్టిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బోరంచు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, కొన్నేళ్లుగా ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే బిల్లులను విడుదల చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పాల్గొన్నారు.


