ఫీవర్రీ! | - | Sakshi
Sakshi News home page

ఫీవర్రీ!

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 8లోu ● నేడు పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

న్యూస్‌రీల్‌

జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్‌ జ్వరాలు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న డెంగీ రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు రిమ్స్‌, పీహెచ్‌సీల్లో వెక్కిరిస్తున్న వెద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు పలు చోట్ల మందుల కొరత

విజిట్‌లో తేటతెల్లం..

పెరిగిన ఆవాస కాలం

మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వైపు సాగే పులుల వలసలకు బోథ్‌, సొనాల అటవీ శ్రేణులు అత్యంత కీలకంగా మారాయి.

ఉట్నూర్‌ జిల్లా ఆసుపత్రిలో అన్ని వార్డులు రోగులతో కిటకిటలాడాయి. సరిపడా బెడ్లు లేకపోవడంతో ఒక్కో పడకపై ఇద్దరేసి చొప్పున ఉంచి చికిత్స అందిస్తున్నారు.

నా పేరు అంజన. మాది ఝరి. మా పాపకు జ్వరం వచ్చింది. రిమ్స్‌లో డాక్టర్‌కు చూపిస్తే మందులు రాసి ఇచ్చారు. కొన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా, సిరప్‌ ప్రైవేట్‌ మెడికల్‌లో కొనుగోలు చేశాను.

జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులను ‘సాక్షి’ మంగళవారం ఉదయం విజిట్‌ చేయగా పలు చోట్ల కనిపించిన దృశ్యాలివి.

జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

కై లాస్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి మంగళవారం జిల్లా కు విచ్చేశారు. స్థానిక పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్‌ రాజర్షిషా, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల భద్రత వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. తాంసి, భీంపూర్‌, ఆదిలాబాద్‌అర్బన్‌ మండలాల్లో బుధవారం పర్యటించనున్నారు. పోలింగ్‌ కేంద్రాలను పరిశీలనతో పాటు క్షేత్రస్థాయిలో సర్‌ ప్రక్రియ అమలు తీరు స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో అధికారులతో సర్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించనున్నారు.

ఇక్కడ కనిపిస్తున్నది రిమ్స్‌ ఆస్పత్రిలోని ఓపీ విభావం.. మంగళవారం ఉదయం 10.30గంటల సమయం.. సీజనల్‌ జ్వరాలతో వచ్చిన రోగులు, వారి సహాయకులతో ఈ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ప్రిస్కిప్షన్‌ కోసం ఇలా బారులు తీరి దర్శనమిచ్చారు.

ఆదిలాబాద్‌టౌన్‌: సీజనల్‌ వ్యాధులతో జనం విలవిల్లాడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో చిన్నా పెద్ద తేడా లేకుండా మంచం పడుతున్నారు. రిమ్స్‌తో పాటు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు డెంగీ విజృంభిస్తోంది. గడిచిన మూడు నెలల్లో 33 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. పీహెచ్‌సీల్లోనూ సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు తప్పని పరిస్థితి. మందుల కొరతతో ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు పేర్కొంటున్నారు.

పెరుగుతున్న డెంగీ కేసులు..

జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో 6, ఆగస్టులో 20, సెప్టెంబర్‌లో 7 కేసులు నమోదైన ట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన వారం రోజుల్లో పట్టణంలోని బంగారుగూడ, రణదీ వెనగర్‌, కేఆర్‌కే కాలనీ, భుక్తాపూర్‌, ఇచ్చోడలోని ధర్మపురి, ఇంద్రవెల్లిలోని శంకర్‌గూడ, నేరడిగొండలోని తర్నంలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

వేధిస్తున్న వైద్యుల కొరత..

జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 22 పీహెచ్‌సీలు ఉండగా, మొత్తం 50 వైద్యాధికార పో స్టులకు గాను 24 ఖాళీగా ఉన్నాయి. 26 మంది మా త్రమే పనిచేస్తున్నారు. ఆయా పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు పీజీ సీట్లు రావడంతో 16 మంది వెళ్లిపోయారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్‌బీఎస్‌కే, జన్‌మన్‌ వైద్యులతో సర్దుబాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. రిమ్స్‌లోనూ ఇదే పరిస్థితి. గైనిక్‌ విభాగం దారుణంగా ఉంది. కీలకమైన ఈవిభాగంలో ముగ్గురు, నలుగు రు వైద్యులు మాత్రమే ఉన్నారు. ఓపీ, ఇన్‌పేషెంట్‌ వార్డుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో పీజీలు, జూనియర్‌ డాక్టర్లతోనే సేవలు అందుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement