లక్ష మందితో ‘చలో హైదరాబాద్‌’ | - | Sakshi
Sakshi News home page

లక్ష మందితో ‘చలో హైదరాబాద్‌’

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

● సీఎం ఎక్కడుంటే.. అక్కడికి వెళ్తాం ● టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లక్ష మందితో ఈనెల 10న చలో హైదరాబాద్‌ నిర్వహిస్తామని టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో సంఘ భవనంలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోలో సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచి నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వడం లేదని పే ర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు ముఖ్య మంత్రి మరో రెండేళ్లు ఓపిక పట్టండి అని అనడం విచారకరమని అన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తామని, అవసరమైతే అసెంబ్లీ వద్దకు వెళ్లి కలుస్తామని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీని వాస్‌రావు, జిల్లా జేఏసీ చైర్మన్‌ ఎ.నవీన్‌కుమార్‌, టీజీవో జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌, జేఏసీ నాయకులు దామోదర్‌ రెడ్డి, ఎ.వెంకట్‌, సదానందం, కట్కం రమేశ్‌, టి.లింగారెడ్డి, తిరుపతి, లచ్చిరాం, శ్యామ్‌, కృష్ణకుమార్‌, స్వామి, కిష్టన్న, అశోక్‌, శ్రీని వాస్‌, నరేందర్‌, వృకోధర్‌, సుదర్శన్‌, శ్యామ్యూల్‌, దిలీప్‌, చంద్రశేఖర్‌, సతీశ్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌ సర్వీస్‌లో కొనసాగించాలని వినతి

వ్యవసాయ శాఖలో డిప్లొమో అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వారిని యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగులు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జగదీశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు. ఇందులో ఏఈవోలు తౌసిఫ్‌, ఆనంద్‌, రమేష్‌, జాహెద్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement