అరెస్టులతో బీఆర్‌ఎస్‌ను అడ్డుకోలేరు | - | Sakshi
Sakshi News home page

అరెస్టులతో బీఆర్‌ఎస్‌ను అడ్డుకోలేరు

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

● మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్‌టౌన్‌: అరెస్టులతో బీఆర్‌ఎస్‌ పార్టీని అడ్డుకోలేరని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంబేడ్కర్‌ చౌక్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యూనుస్‌ అక్బాని, ప్రకాశ్‌, మెట్టు ప్రహ్లాద్‌, సాజిదొద్దీన్‌, అశోక్‌ స్వామి, రాజు, రమేశ్‌, నారాయణ, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement