పర్యావరణహితంగా గణేశ్‌ నవరాత్రులు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణహితంగా గణేశ్‌ నవరాత్రులు

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

● మట్టి గణపతులనే ప్రతిష్టించాలి ● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: జిల్లాలో వినాయక నవరాత్రి వేడుకల ను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవ శాంతియుత సమన్వ య కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించా రు. ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలు, నిమజ్జనం, ట్రాఫిక్‌ నియంత్రణ, విద్యుత్‌ భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్యసేవలు తదితర అంశాలపై కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘మట్టి గణ పతులను పూజిద్దాం–పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే సత్సంకల్పంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రజలకు పంపిణీ చేసేందుకు 2,000 మట్టి వినా యక ప్రతిమలను అందుబాటులో ఉంచినట్లు తెలి పారు. కావాల్సిన వారు 81063 44637, 97018 88058 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఉచిత మట్టి విగ్రహాల పంపిణీని కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్‌, ఆర్‌ఎస్‌ చిత్రు, సబ్‌ కలెక్టర్‌ కే. ప్రణయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అనూష, వైస్‌ చైర్మన్‌ రో హిత్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, వివిధ శాఖల అధికా రులు, ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మండపాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ఆదిలాబాద్‌టౌన్‌: గణేశ్‌ మండపాలకు ఆన్‌లైన్‌ రిజి స్ట్రేషన్‌ తప్పనిసరి అని ఎస్పీ అఖిల్‌మహాజన్‌ అన్నా రు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. మండపాల నిర్వహణ, నిమజ్జనం తేదీ, సమయం, మార్గం, ప్ర దేశం, నిర్వాహకులు, వలంటీర్ల వివరాలను పోలీ సుశాఖ రూపొందించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. policeportal. tspolice.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చాలని తెలిపారు.

భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

కై లాస్‌నగర్‌: ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రి య వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. బాధితులకు సంబంధించిన ప్రిలిమిన రీ నోటిఫికేషన్‌ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలన్నారు. గడువులోపు రైతులు, గ్రామస్తులతో మాట్లాడి భూసేకరణ రేట్లను ఖరారు చేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌. చిత్రు, ఎస్‌.రాజేశ్వర్‌, డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణ, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ ప్రభాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, ఇరిగేషన్‌ ఈఈ నరేశ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement