నెల్లూరు(బృందావనం): క్రాంతి మహిళా మండలి అధ్యక్షురాలు గుమ్మడి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ సేవకురాలు దొడ్ల ప్రమీలమ్మ కుమారుడు, ప్రవాస భారతీయుడు దొడ్ల శ్రీకర్‌రెడ్డి షష్టిపూర్తి మహోత్సవాన్ని పురస్కరించుకుని పడారుపల్లి దివ్యాంగుల కాలనీ, కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని మూగజీవుల సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న 50 మంది కార్మికులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే మూగజీవుల పశుగ్రాసం కోసం రూ.2 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంరక్షణ కేంద్రం నిర్వాహకురాలు యు.ఉమాదేవి, శివకుమార్‌రెడ్డి, శీనమ్మ పాల్గొన్నారు.


