బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు | - | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు

Sep 7 2026 12:09 AM | Updated on Sep 7 2026 12:09 AM

నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ ఖాతాదారులకు వ్యవసాయం, వ్యాపారం, వ్యక్తిగత అవసరాలకు బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తామని నెల్లూరు రీజినల్‌ మేనేజర్‌ పి.వెంకటరమణ అన్నారు. ఆదివారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో అప్రైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఎం మాట్లాడారు. ఖాతాదారులకు బంగారు రుణాలు చేరువ చేయడంలో అప్రైజర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాతాదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీనియర్‌ మేనేజర్లు ఎం.వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

బాల్య వివాహాలపై పోరాటానికి గుర్తింపు

నెల్లూరురూరల్‌: బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి నవంబర్‌ 27ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడాన్ని చైతన్య జ్యోతి వెల్ఫేర్‌ సొసైటీ స్వాగతించింది. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్‌ ఇరగనబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ భాగస్వామిగా బాల్య వివాహాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1,200 బాల్య వివాహాలను అడ్డుకున్నామని చెప్పారు. పాఠశాలలు, పంచాయతీలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఐ.శ్రీనివాసరావు, ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ జి.శంకరయ్య, సీఎస్‌డబ్ల్యూ షేక్‌ మున్వీర్‌, కార్యకర్తలు వి.పద్మావతి, వి.కనకాద్రి, కె.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement