ఆదిలాబాద్‌టౌన్: జీవో 97 ప్రకారం పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీ నం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంట నే ఉపసంహరించుకోవాలని పాలిటెక్నిక్ అధ్యాపకులు డిమాండ్ చేశారు. సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పట్టణంలోని సంజ య్ గాంధీ పాలిటెక్నిక్ ఆవరణలో టీపీ–జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ల విలీనం వల్ల బడుగు, బలహీన, పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందే అవకాశాలు దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్‌ను శక్తిశాఖలోకి కాకుండా సాంకేతిక విద్యలోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేష్, టీపీ జేఏసీ లోకల్ యూనిట్ అధ్యక్షుడు సాయన్న, కోశాధికారి కే. మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాథోడ్ శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీ రాథోడ్ జైపాల్, సభ్యులు పాల్గొన్నారు.


