నేరడిగొండ: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా నోడల్ అధికారి సాహెబ్‌రావ్ పవార్ అన్నారు. కుమా రి ప్రాథమిక పాఠశాలను జిల్లాస్థాయి తనిఖీ బృందంతో కలిసి బుధవారం సందర్శించారు. ఉపాధ్యాయులు వినియోగిస్తున్న టీచింగ్ లె ర్నింగ్ మెటీరియల్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐ బోధన తీరుపై ఆరా తీశారు. వి ద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఇందు లో సభ్యులు అరుణ్‌రాజ్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్, శివలీల, వాణిశ్రీ పాల్గొన్నారు.


