● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ జాగృతి దివస్‌లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, గుర్తుతెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసేజ్‌లు, లింకులు, ఫోన్‌కాల్స్ నమ్మవద్దని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు, అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపే ఆఫర్లకు ఆకర్షితులైతే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదముందన్నారు. కేవైసీ, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, మ్యాట్రిమోనీ, నకిలీ లింకులు వంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌లో సంప్రదించాలని సూచించారు. ముందుగా సైబర్ మోసాలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ నైలు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి.సునీల్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం, ఏఎస్సై సురేందర్, సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి
కై లాస్‌నగర్: సహకార శాఖలో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ గౌస్ బాబాకు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది. జిల్లా సహకార అధికారి కార్యాలయంలో పోస్టింగ్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారిని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ కలీం అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం సత్కరించారు. ఇందులో సూపరింటెండెంట్ సయ్యద్ రాహీల్ అహ్మద్, ఉర్దూ అధికారి తన్వీర్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు.


