దివ్యాంగులకు సదరం ‘పరీక్ష’
దివ్యాంగుల వైకల్యాన్ని నిర్ధారించేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన సదరం ధ్రువపత్రాల జారీ ప్రక్రియ వారికి పరీక్షగా మారింది. సర్టిఫికెట్ల జారీకి ఒక్కరోజే సమయం ఇవ్వడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దివ్యంగులు పెద్ద ఎత్తున రిమ్స్‌కు తరలివచ్చి గంటలకొద్దీ క్యూలో వేచి ఉన్నారు. అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి వెంట వచ్చిన సహాయకులు కొంత చేదోడుగా నిలిచినా...దివ్యంగులకు ఇబ్బంది తప్పలేదు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
ఆదిలాబాద్: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇందిరా ప్రియదర్శి ని స్టేడియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడాజ్యోతి వెలిగించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీ య స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారిఅనూష, డీవైఎస్‌వో దయానంద్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, పీడీలు స్వామి, సాయికుమార్, డీఎస్‌ఏ ఉద్యోగులు, రజి, సురేశ్, శిక్షకులు రాజు, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూయూఆర్‌జేసీలో..
ఆదిలాబాద్‌రూరల్: జిల్లాకేంద్రంలోని టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీలో నిర్వహించిన వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా వన మహోత్సవంలో భాగంగా మొక్క నాటారు. అనంతరం కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ ప్యానెల్‌ను ఆవిష్కరించారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. విద్యార్థులకు యూనిఫాం పంపి ణీ చేశారు. ఇందులో ప్రిన్సిపాల్ అనిల్, వైస్‌ప్రిన్సిపాల్ యోగేష్ దీక్షిత్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎఫ్‌ఎల్‌ఎన్‌ను బాధ్యతగా అమలు చేయాలి
కై లాస్‌నగర్: తొలిమెట్టు (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమ అమలులో భాగంగా విద్యార్థులలో ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఉపాధ్యాయులను ఆదేశించారు. స్థా నిక టీటీడీసీలో జిల్లా స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ సమీక్ష స మావేశం శనివారం నిర్వహించారు. ముఖ్యంగా తెలుగు, గణితం, ఇంగ్లిష్ విషయాల్లో విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిని, వివిధ గ్రేడ్‌ల వారీగా వారి అభ్యసన స్థాయిలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించా రు. ఆగస్టులో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు నిర్వహించిన పాఠశాలల తనిఖీ నివేదికలపై సు దీర్ఘంగా సమీక్ష జరిపి పలు కీలక సూచనలు చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొలి మెట్టు అమలు మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల క్రమం తప్పకుండా పాఠశాలస్థాయి (25న), మండల స్థాయి(26న), జిల్లా స్థాయి (27న) జరగాలని ఆదేశించారు. బోధనను మరింత ఆకర్షణీయంగా, సులభంగా మార్చడంలో బోధనా అభ్యసన సామగ్రి కీలకమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతకు పదునుపెట్టేలా సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు మండల స్థాయిలో‘టీఎల్‌ఎం మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపికై న ఉత్తమ ప్రదర్శనలతో సెప్టెంబర్ 22న జిల్లా స్థాయి మెగా టీఎల్‌ఎం మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా ఆగస్టులో ఉత్తమ బోధన సామర్థ్యాల ప్రదర్శనకు గాను బోథ్ మండలం కంటేగాం ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు గోవింద్‌కు ప్రశంస పత్రంను కలెక్టర్ అందజేశారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధి కారి మాధవి, అకడమిక్ కోఆర్డినేటర్ లక్ష్మణ్, మండలాల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కాంపిటెంట్ పాఠశాలల హెడ్‌మాస్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


