స్వతంత్రులకు అదృష్టం! | - | Sakshi
Sakshi News home page

స్వతంత్రులకు అదృష్టం!

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

● బల్దియాలో కలిసొచ్చిన ఎన్నికలు ● ‘కోఆప్షన్‌’ మద్దతు కోసం భారీగా ఆఫర్లు ● క్యాంపులకు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు ● ప్రయత్నాల్లో నిమగ్నమైన కూటమి, బీజేపీ

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్ని క పొలిటికల్‌ హీట్‌ పెంచగా ఇండిపెండెంట్‌ కౌన్సి లర్లను మాత్రం అదృష్టం వరించనున్నట్లు తెలు స్తోంది. ఈ నెల 31న జరిగే కోఆప్షన్‌ ఎన్నికలో వీరి మద్దతే కీలకం కానుండగా.. ప్రసన్నం చేసుకునేందుకు అధికార, విపక్షాలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నా యి. నాలుగు స్థానాలను ఎలాగైనా కై వసం చేసుకు ని చైర్‌పర్సన్‌ ఎన్నికలో ఎదురైన భంగపాటుకు ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అలాగే కూటమిగా ఏర్పడి బల్దియా పీఠాన్ని కై వసం చేసుకున్న కాంగ్రెస్‌ సైతం ‘కమలం’ పార్టీ ఆశలకు గండికొట్టాలని భావిస్తోంది. దీంతో ఆయా పార్టీలు ఇండిపెండెంట్లను ఆకర్షించేలా వరాలజల్లు కురిపిస్తున్నాయి. కూటమి తరఫున కొత్త అభ్యర్థులు తెరపైకి రావడంతో సోమవారం వరకు పరిణామాలు మారే అవకాశముందని తెలుస్తోంది.

భారీగా బేరసారాలు

ఈ ఎన్నికలో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కూటమితో పాటు విపక్ష బీజే పీ భావిస్తోంది. ఇందులో స్వతంత్ర కౌన్సిలర్ల మద్ద తే కీలకం కానుండటంతో వారితో ఇరు పార్టీలు బేరసారాలు సాగిస్తున్నాయి. డిమాండ్‌ మేరకు ఒక్కో సభ్యుడికి రూ.15లక్షల నుంచి రూ.25లక్షల వరకు ముట్టజెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థులు ఇందులో సగం ఖర్చు భరించేందుకు సి ద్ధంగా ఉండటంతో ఎలాగైనా కై వసం చేసుకోవా లని ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. బీజేపీ ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లను మహారాష్ట్రలోని ప్రత్యేక క్యాంపులకు తరలించింది. ఇందుకుగాను భారీ న జరానాతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, బల్దియా అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యత ఇస్తామని వారిని తమ శిబి రంలోకి రప్పించారు. ఈ క్రమంలో కూటమి నేతలు అప్రమత్తమయ్యారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన స్థానిక ముఖ్య నేతలతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి శనివారం ఫోన్‌లో ప్రత్యేకంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే సమావేశ ఎజెండాను తీసుకునేందుకు నిన్నటి వరకు వెనుకంజ వేసిన బీఆర్‌ఎస్‌ సభ్యులకు దాన్ని తీసుకోవాలంటూ పార్టీ ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మారుతున్న సమీకరణాలు

ప్రత్యేక సమావేశ గడువు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నిన్నటి వరకు పార్టీ తరఫున గెలుపొందిన 21మంది కౌన్సిలర్లు, ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో సభ్యులతో పాటు నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో 27 సభ్యుల సంపూర్ణ మెజార్టీతో నాలుగు పదవులను సులువుగా కై వసం చేసుకుంటామని బీజేపీ భావించింది. ఈ క్రమంలో కూటమి నుంచి మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ శిబిరంలో ఉన్న ఇద్దరు సభ్యులతో వారు మంతనాలు సాగిస్తూ తమవైపునకు రప్పించే ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా చర్చ సాగుతుంది. కూటమి తరఫున కొత్త అభ్యర్థులకు మద్దతునిచ్చే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ తనకు మద్దతునిస్తే రూ.25లక్షలు వెచ్చిస్తానని కూటమి ముఖ్య నేతలకు చెప్పినట్లుగా వినిపిస్తోంది. బీజేపీ తరఫున మైనార్టీ కోటా కింద మద్దతు ఆశిస్తున్న మాజీ కౌన్సిలర్‌ సైతం ఎంత ఖర్చుకై నా వెనుకాడేది లేదని చెబుతుండటంతో ఇండిపెండెంట్లపై కనకవర్షం కురిసే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతుంది. చైర్‌పర్సన్‌ ఎన్నిక సమయంలో ఒప్పుకున్న నగదు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న ఓ కౌన్సిలర్‌ ఆశించిన తాయిలం అందిస్తే కూటమి వైపు వచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో స్వతంత్ర కౌన్సిలర్‌ తనకు రూ.25లక్షలు ఇస్తే మీకే మద్దతునిస్తానంటూ కూటమినేతలకు భరోసానిచ్చినట్లుగా సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీలు వారడిగినంత ముట్టజెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ రాజకీయంగా జోరుగా సాగుతుంది. అయితే ఆదివారం నాటికి ఈ పరిణామాలు మారి మెజార్టీపై స్పష్టతవచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

కలెక్టర్‌ను కలిసిన బీజేపీ కౌన్సిలర్లు

కాగా బీజేపీ సభ్యులు శనివారం కలెక్టర్‌ రాజర్షి షాను మరోసారి కలిసి సమావేశ నిర్వహణ పారదర్శకంగా జరిగేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు. గత సమావేశంలో ఎదురైన ఘటనలను ప్రస్తావిస్తూ సమావేశాన్ని లైవ్‌గా టెలికాస్ట్‌ చేసేలా ఏర్పాట్లు చేయాలని, అలాగే సమావేశ మందిరంలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని కోరారు. కమిషనర్‌ ఆధ్వర్యంలో కాకుండా అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశం జరిగేలా చూడాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement