ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్ర మ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యా ప్రమాణా లు మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని పీవో మంద మకరందు అన్నారు. కేబీ కాంప్లెక్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షకులు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారులు, హెచ్‌డబ్ల్యూవోలతో సమీ క్షించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, ప్రతీ విద్యార్థి ఆధార్ వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రాప్‌అవుట్ కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించేలా బోధనా పద్ధతులను మెరుగుపరచాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి నెల 26న పాఠశాల స్థాయిలో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో గుర్తించిన సమస్యలకు తక్షణ పరిష్కార మార్గాలను రూపొందించి, తదుపరి సమావేశంలో పురోగతిని సమీక్షించాలన్నారు.


