● ఐటీడీఏ పీవో మంద మకరందు | - | Sakshi
Sakshi News home page

● ఐటీడీఏ పీవో మంద మకరందు

Aug 19 2026 1:06 AM | Updated on Aug 19 2026 1:06 AM

● ఐటీడీఏ పీవో మంద మకరందు

‘కుంటాల’ను పర్యాటక

కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

నేరడిగొండ: మండల కేంద్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుంటాల జలపాతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. మంగళవారం జలపాతాన్ని సందర్శించారు. ప్రకృతి సోయగాలకు నిలయంగా ఉందని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కేవలం రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా అ భివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్థా నిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎకో టూరిజం కార్యక్రమాలను ప్రోత్సహిస్తామన్నారు. ప్రకృతి అందాలను కాపాడుకుంటూనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు గిరిజన యు వతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నా రు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూ పొందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు.

కుంటాల జలపాతం వద్ద పీవో మకరందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement