ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ఐబీ ప్రాంతంలో ఈనెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎంఈవో ఆశన్న హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం భౌతికకాయం స్వగ్రామానికి చేరుకోవడంతో మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల ఉపాధ్యాయులు, లక్కారం జెడ్పీఎస్‌ఎస్ పాఠశాల విద్యార్థులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు అధికసంఖ్యలో ఎంఈవో నివాసానికి చేరుకున్నారు. ‘సార్.. ఇక రారా... మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి ఎక్కడికి వెళ్లారు!’ అంటూ విద్యార్థులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
డీఈవో, ఉపాధ్యాయ సంఘాల నివాళి
ఉట్నూర్‌రూరల్: ఎంఈవో ఆశన్న పార్థివ దేహానికి డీఈవో మాధవి, వివిధ ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. అంత్యక్రియల్లో సర్పంచ్ అనిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ బే గం అన్సారి, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముడుగు శ్యా ముల్, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీ తల్ చవాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాథోడ్ సుమన్‌బాయి, బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు భరత్ చౌహాన్, తదితరులు పాల్గొన్నారు.


