దశ దిశ లేకుండా.. | - | Sakshi
Sakshi News home page

దశ దిశ లేకుండా..

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

సాక్షి, రాజమహేంద్రవరం: మహిళలకు ‘దిశ’ రక్షణ కవచం అయ్యింది.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలతో ఆ బిల్లు పుట్టికొచ్చింది. ఎందరికో ఆసరాగా మారింది. అలాంటి దిశ బిల్లును ఒక్క సంతకంతో చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. ఆడబిడ్డల భద్రతను ప్రమాదంలోకి నెట్టేసింది. పని ప్రదేశంలో వేధింపులు, ఆత్యాచారాలు, చిన్నారులపై ఆఘాయిత్యాలను అరికట్టే వ్యవస్థను కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. ఈ వ్యవహారంపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిత్యం ఏదోక మూల అబలలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు దిశ బిల్లును రద్దు చేయడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది. నేరస్తుల్లో భయాన్ని పుట్టిస్తూ.. మహిళలు, చిన్నారుల రక్షణకు దిశ బిల్లును 2020లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారు. మహిళల రక్షణలో విప్లవాత్మకంగా నిలిచిన ఈ యాప్‌ కారణంగా సీ్త్రలపై దాడులు చాలా వరకు తగ్గాయి. ఎక్కడైనా ఎవరైనా వేధింపులకు గురైనా తక్షణం భద్రత దక్కేది. ఈ బిల్లును 2020 ఫిబ్రవరిలో తీసుకొచ్చి దిశ యాప్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి తూర్పు గోదావరి జిల్లాలో యాప్‌ను సుమారు 45 వేల మంది మహిళలు తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సుమారు 1,300 మంది బాధితులు యాప్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందగలిగారు.

సులువుగా వినియోగించుకునేలా..

దిశ బిల్లు అమలులోనూ అప్పటి జగన్‌ ప్రభుత్వం సంపూర్ణ చిత్తశుద్ధిని ప్రదర్శించింది. ప్రతి జిల్లాలో మహిళా పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ మహిళా పోలీసులను అందుబాటులో ఉంచి క్షేత్ర స్థాయిలోనే బాధితులు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దిశ యాప్‌ను ఎవరైనా సులువుగా వినియోగించుకునేలా రూపొందించింది. ఫలితంగా బాధితులకు అత్యవసర సమయంలో ఎంతో రక్షణగా నిలిచింది. ఎంతో మంది బాధితులకు భరోసానిచ్చిన దిశ చట్టానికి జాతీయ స్థాయిలోనూ అవార్డులొచ్చాయి. ప్రస్తుతం ఆ బిల్లున్నే రద్దు చేసి మహిళల రక్షణను చంద్రబాబు ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టేసింది.

ఫ బిల్లు రద్దుతో మహిళలకు భద్రత కరవు

ఫ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

ఫ తొలి పోలీస్‌ స్టేషన్‌ను

రాజమహేంద్రవరంలోనే ప్రారంభం

ఫ ప్రస్తుతం దిశ బిల్లును రద్దు చేసిన చంద్రబాబు సర్కారు

నేరస్తుల్లో భయం తగ్గుతుంది

దిశ బిల్లు రద్దయితే మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే మద్యం ఏరులై పారుతోంది. ప్రతి వీధిలోనూ బెల్ట్‌ దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారు. గంజాయి ఎక్కడికక్కడే దొరుకుతోంది. వాటిని తాగి మత్తులో ఆకతాయిలు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందువల్లే గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దిశ బిల్లు రద్దు చేస్తే నేరగాళ్లలో భయం తగ్గి రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

– నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం

నిర్వీర్యం కాదు.. బలోపేతం చేయాలి

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లును రద్దు చేయడం కాదు. చంద్రబాబు ప్రభుత్వానికి చేతనైతే మరింత బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ దురుద్దేశంతో నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గం. ఇటువంటి బిల్లును రద్దు చేయడంతో మహిళలకు భరోసా దూరమవుతుంది.

– తానేటి వనిత, మాజీ హోం మంత్రి,

వైఎస్సార్‌ సీపీ గోపాలపురం ఇన్‌చార్జి

రద్దు చేయడం దుర్మార్గం

చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలు, యువతులకు రక్షణ కరువైంది. ఇటువంటి పరిస్థితుల్లో దిశ బిల్లును రద్దు చేయడం దుర్మార్గమైన చర్య. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ విషయంలో చిత్తశుద్ధి లేదనేందుకు ఆ ఘటనే నిదర్శనం.

– జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ

అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement