సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన తప్పనిసరి

Aug 7 2026 1:44 AM | Updated on Aug 7 2026 1:44 AM

కైలాస్‌నగర్‌: కాలానుగుణంగా అధికారులు సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. జిల్లా యంత్రాంగం, తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ సంయుక్తంగా గు రువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జి ల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక సామర్థ్యాల పెంపుపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. డీజీ ఐసీ ప్రతినిధులు వేర్వేరు రంగాల్లో సాధించిన నూ తన ఆవిష్కరణలు, వినూత్న పనితీరు విధానాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరిస్తూ శిక్షణ ఇచ్చారు. జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, డీపీవో రమేశ్‌, టీ హబ్‌ మేనేజర్‌ అంకిత, జిల్లా కోఆర్డినేటర్‌ నిఖిని వర్మ, టీ వర్క్స్‌ అసోసియే ట్‌ అరవింద్‌, జైకా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఝాన్సీ, అగ్‌హ బ్‌ మేనేజర్‌ ముఖేశ్‌, టీజీఐసీ కమ్యూనికేషన్స్‌ లీడ్‌ సాహిల్‌, గ్రాస్‌రూట్స్‌ ఇన్నోవేషన్‌ లీడ్‌ రమేశ్‌, వివి ధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తల్లిపాలపై అవగాహన పెంచుకోవాలి

ఆదిలాబాద్‌రూరల్‌: తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. మండలంలోని అంకోలి పంచాయతీ పరిధి సిరికొండలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లి పాలు మాత్రమే అందించాలని సూచించారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించారు. అంగన్‌వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు చిన్నారులకు కలెక్టర్‌ చేతుల మీదుగా అన్నప్రాసన చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి మిల్కా, సర్పంచ్‌ మడావి కిషన్‌, తహసీల్దార్‌ గోవింద్‌, ఎంపీడీవో వంశీకృష్ణ, సీడీపీవో సౌందర్య, వైద్యాధికారి ఆశాకిరణ్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement