ఆచార్య జయశంకర్‌కు నివాళి | - | Sakshi
Sakshi News home page

ఆచార్య జయశంకర్‌కు నివాళి

Aug 7 2026 1:44 AM | Updated on Aug 7 2026 1:44 AM

కైలాస్‌నగర్‌: తెలంగాణ సిద్ధాంతకర్త కర్త, ఆచా ర్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతిని గురువా రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ రాజర్షి షా అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి పాల్గొన్నా రు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ దిశానిర్దేశం చేశారని కొని యాడారు. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేస్తూ ప్రజలు, విద్యార్థులను చైతన్య పరి చారని తెలిపారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసంక్షేమం, జి ల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ ఆర్‌ఎస్‌.చిత్రు, డీఆర్వో స్రవంతి, ఏవో వర్ణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి డి.సోనియా, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement