ఉట్నూర్‌రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. గురువారం పీఎంఆర్‌సీ భవనంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న మెళకువలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆశ్రమ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీఎంవో జగన్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉట్నూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల బీఎల్‌ఏ–2లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పలు సూచనలు చేశారు.


