సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత తప్పనిసరి

Aug 7 2026 1:44 AM | Updated on Aug 7 2026 1:44 AM

ఆదిలాబాద్‌టౌన్‌: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ సూచించారు. గు రువారం హైదరాబాద్‌ నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరం, సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీల్లో మరింత మెరుగైన సేవలందించాలని సూచించారు. టీబీ నివారణకు కృషి చేయాలని, వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. గర్భిణులు, చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాతా, శిశు మరణాలను తగ్గించాలని, హైరి స్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని తె లిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సక్రమంగా మందులు అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధి కారి సాధన, ఇమ్యూనైజేషన్‌ అధికారి వైసీ శ్రీని వాస్‌, ప్రోగ్రాం అధికారులు ఈశ్వర్‌ రాజు, ని లోఫర్‌, దేవిదాస్‌ నాయక్‌ జాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement