కై లాస్‌నగర్: రేషన్‌షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొందరు దళారులు తక్కువ ధరకు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో అడపాదడప బియ్యం పట్టుబడుతూ కేసులు నమోదవుతున్నా అక్రమ దందాకు అడ్డుకట్ట పడడంలేదు. కొందరు రేషన్ డీలర్లు కూడా లబ్ధిదారుల వేలి ముద్రలు వేయించుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు.
అసలేం జరుగుతోందంటే..
కొందరు దళారులు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారుల నుంచి కిలో బి య్యాన్ని రూ.12నుంచి రూ.15చొప్పున కొంటున్నా రు. ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చి దొడ్డిదారిన మహారా ష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకు రూ.30 నుంచి రూ.40 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు స్థానిక బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గత మూడున్నరేళ్లలో 3,871 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు దళారుల నుంచి స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో పట్టుకున్న బియ్యం కేసుల వివరాలు
సంవత్సరం కేసులు నిందితులు పట్టుకున్న బియ్యం విలువ (రూ.లలో)
(క్వింటాళ్లలో)
2023 11 11 224.80 1,57,636
2024 20 41 1,609.40 22,18,395
2025 29 47 1,280.20 42,57,480
2026 (ఇప్పటివరకు) 48 77 156.16 4,02,950


