మహిళలు, బాలికల భద్రతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళలు, బాలికల భద్రతే లక్ష్యం

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ● షీటీం పనితీరుపై సమీక్ష

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలు, బాలికల భద్రతే లక్ష్యమని, ‘పోలీస్‌ అక్క’ విద్యార్థులకు తోబుట్టువుగా ఉండాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జూలై నెల షీటీం పనితీరును సమీక్షించారు. జూలైలో ఆకతాయిలపై 95 ఈ పెట్టీ కేసులు, మహిళల వేధింపులపై ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులపై స్పందించి 21మంది మైనర్లు, ఇద్దరు మేజర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలు, గ్రామాల్లో 71 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మ హిళల భద్రత, సైబర్‌ నేరాలు, సోషల్‌ మీడియా మోసాలు, బాల్య వివాహాల నివారణ, మహిళల హక్కులపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. 157 హాట్‌స్పాట్లలో ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు 57 గ్రామాల్లో భద్రతపై చైతన్యం కల్పించినట్లు తెలి పారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏఎస్సై జయలక్ష్మి, కానిస్టేబుళ్లు మమత, పూజకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అదనపు ఎస్పీ మౌనిక, ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, షీటీం ఇన్‌చార్జి సుశీల, వాణిశ్రీ, సిబ్బంది రోహిణి పాల్గొన్నారు.

ఆపదలో ఆపద్బాంధవులుగా నిలవాలి

ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవులుగా నిలవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో డయల్‌ 112, బ్లూ కోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతీ ఫిర్యాదుపై వెంటనే స్పందించి క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు రక్షణగా నిలవాలని, సైబర్‌ నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూ చించారు. ఓపెన్‌ డ్రింకింగ్‌, రౌడీ షీటర్ల తనిఖీలు, గ్రామ సందర్శనలు, పోలీసు మీకోసం కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. రాత్రి వేళ తనిఖీలు ముమ్మరం చేయాలని, పాయింట్‌ బుక్స్‌, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేసి అభినందించారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీసీఆర్‌బీ ఎస్సై ప్రవీణ్‌, కమ్యూనికేషన్‌ ఎస్సై గణేశ్‌ తదితరులున్నారు.

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ కవచ్‌లో భాగంగా గంజా యి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసిన సిబ్బందిని జిల్లా పోలీస్‌ కార్యాలయానికి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రెండ్రోజుల క్రితం భీంసరి చెక్‌పోస్ట్‌ సిబ్బంది, టూటౌన్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి గంజాయితో వెళ్తున్న ఓ నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏఆర్‌ ఎస్సై రఫీక్‌ ఉల్‌ రహెమాన్‌, ఏఎస్సై లక్ష్మీనారాయణ, కానిస్టేబుళ్లు కిషన్‌, జలపతిరావు, వంశీ నాయక్‌కు నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement