నిరుపేదలకు ఆసరా | - | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు ఆసరా

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

నిరుపేదలకు ఆసరా

ఆర్థిక పరిపుష్టికి అండగా ప్రభుత్వం

కేరళ తరహా పథకానికి రూపకల్పన

పైలట్‌ ప్రాజెక్ట్‌గా ‘నార్నూర్‌’ ఎంపిక

17 గ్రామాల్లోని అర్హులైన వెయ్యిమంది జీవనోపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు

కై లాస్‌నగర్‌: అత్యంత నిరుపేద కుటుంబాల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేరళ సర్కారు విజయవంతంగా అమలు చేసిన పేదరిక నిర్మూలన విధానం స్ఫూర్తి గా సమావేశి అజీవికా యోజన (సే) అమలుకు సంకల్పించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ద్వారా దీన్ని అమలు చేయనుంది. సమాజంలో ఎలాంటి ఆసరా లేని అత్యంత నిరుపేదలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా జీవనోపాధి కల్పించనుంది.

నార్నూర్‌ మండలం ఎంపిక

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న ఈ పథకం రెండో విడత పైలట్‌ ప్రాజెక్ట్‌లో రాష్ట్రంలో ఎనిమిది మండలాలను ఎంపిక చేయగా ఇందులో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన నార్నూర్‌ మండలానికి చోటు దక్కింది. ఈ మండలంలోని అత్యంత వెనుకబడిన ఆదిమ గిరిజన తెగలకు చెందిన కోలాం, గోండు, తోటిలతో పాటు ఎస్సీ సా మాజిక వర్గాల వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నా రు. మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉండగా అత్యంత నిరుపేదలున్న 17గ్రామాల పరిధిలో వె య్యి మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మట్టి గోడలతో కూడిన ఒకే గదిలో నివసించేవారు, సొంత ఇల్లు, స్థలం, స్థిరమైన ఆదాయం లేనివారు, నిరుపేద ఒంటరి మహిళలు, వితంతువులు, ఆసరా లేని వృద్ధులు, పారిశుద్ధ్య కార్మికులు, చెత్త సేకరించే వారు, ట్రాన్స్‌జెండర్లు, టీబీ, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, బాల కార్మికులున్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఐదంచెల విధానంలో సర్వే చేపడతారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఆయా గ్రామాల్లోని అన్ని వీధుల్లో పర్యటించి వారి పూర్తి వివరాలు సేకరిస్తారు. అనంతరం పంచాయ తీ కార్యాలయం వద్ద మ్యాప్‌ రూపొందిస్తారు. ఇళ్ల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి ఆధారంగా గ్రామ, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో జాబితా ఎంపిక పూర్తి చేసి పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ద్వారా కలెక్టర్‌ ఆమోదం కోసం పంపనున్నారు. కాగా, ప్రస్తు తం జిల్లాలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

ఆర్థిక స్థిరత్వం సాధించే దాకా..

లబ్ధిదారులు ఆర్థిక స్థిరత్వం, స్వయం సమృద్ధి సా ధించేదాకా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవనుంది. రేషన్‌, ఆధార్‌, ఓటరు ఎపిక్‌ కార్డులు, పె న్షన్‌, బ్యాంక్‌ అకౌంట్‌, సదరం సర్టిఫికెట్‌ తదితర సేవలకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు అందించేలా మండల సమాఖ్యలు చూస్తాయి. కు టుంబ పోషణకు ఆరు నెలలు ఉచితంగా పౌష్టికా హారం కిట్లు లేదా నెలకు రూ.వెయ్యి చొప్పున నగ దు ఇస్తారు. చిరు వ్యాపారాలు చేసుకునేలా షాపుల ఏర్పాటు, గేదెలు, మేకలు, గొర్రెల పెంపకం కోసం రూ.25వేల నుంచి రూ.30వేల వరకు బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూత అందించనున్నారు. వ్యవసాయ పరికరాలు ఉచితంగా అందజేస్తారు.

కేటగిరి, లబ్ధిదారుల వివరాలు

కేటగిరి లబ్ధిదారులు

పీవీటీజీ 110

ఎస్టీ 677

ఎస్సీ 215

ప్రతీ 30మందికో కోచ్‌

లబ్ధిదారులకు నిరంతరం మార్గదర్శనం చేసేందుకు, వారికి అవసరమైన సేవలు అందించేలా చూసేందుకు ప్రతీ 30 మందికో కోచ్‌ను నియమించారు. ఆయా గ్రామాల్లో పదోతరగతి పూర్తి చేసిన అదే కమ్యూనిటీకి చెందిన యువతులు, మహిళలను ఎంపిక చేశారు. వీరికి మూడు విడతల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం తొలి విడత శిక్షణ పూర్తయింది. లబ్ధిదారులు ఆర్థికంగా స్థిరపడేదాకా అవసరమైన సహాయ, సహకారాలు అందించనున్నారు. ఈ కోచ్‌ల పనితీరును ప్రతినెలా మండల సమాఖ్యలు సమీక్షించి మార్గదర్శనం చేయనున్నాయి.

వెయ్యిమందిని ఎంపిక చేస్తాం

జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. 17 గ్రామాల పరిధిలో అత్యంత నిరుపేదలైన వెయ్యి మందిని ఎంపిక చేస్తాం. వారికి అవసరమైన చేయూతను అందించేందుకు, అండగా నిలిచేందుకు ప్రతీ 30 మందికో కోచ్‌ను నియమిస్తున్నాం. సర్వే సమయంలో అందుబాటులో లేని అర్హత కలిగినవారు ఆందోళన చెందవద్దు. గ్రామ, మండల సమాఖ్యలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవ చ్చు. సెప్టెంబర్‌ నుంచి పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. – జాదవ్‌ గోవింద్‌రావు,

అడిషనల్‌ డీఆర్డీవో (సెర్ప్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement