అదిలాబాద్: జిల్లాలో నిర్మించనున్న ఎయిర్‌పో ర్టు పనులు వేగవంతం చేయాలని కోరుతూ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ న్యూఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ జాయింట్ సెక్రెటరీ మహంతిని కలిసి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భూకేటా యింపునకు సంబంధించిన ప్రత్రాలను ఆయనకు సమర్పించి, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు, తదుపరి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్రరక్షణ శాఖ అధికారులు ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.


