విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Jul 30 2026 12:21 AM | Updated on Jul 30 2026 12:21 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వపాఠశాల గెజిటెడ్‌ నం.1 లో నేత్ర వైద్య శిబిరం, వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూషతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ మాధ వి, కౌన్సిలర్‌ కలాల శ్రీనివా స్‌, ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి తదితరులు పాల్గొన్నారు. సరస్వతినగర్‌లో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రణాళికలపై విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ సమన్వయకర్తలతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణా లు పెంచడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి మాధవి, అకడమిక్‌ మోనిటరింగ్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌, జీసీడీవో, ఎంఈ ఓలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి

ఆదిలాబాద్‌రూరల్‌: గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయా లని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన మండ ల పరిషత్‌ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పలువురు సర్పంచ్‌లు గ్రామాల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వ్యాధుల సీజన్‌ కావడంతో పారి శుద్ధ్య నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, డీపీవో రమేశ్‌, ఎంపీడీవో వంశీకృష్ణ, తహసీల్దార్‌ గోవింద్‌, ఎంపీవో ఆనంద్‌, అధికారులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కై లాస్‌నగర్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. మో డల్‌ విలేజ్‌ అభివృద్ధిలో భాగంగా ఉట్నూర్‌ మండలంలోని మత్తాయిగూడలో చేపట్టిన నిర్మాణాలను సెప్టెంబర్‌ 15నాటికి పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. మత్తాయిగూడలో మోడల్‌ విలేజ్‌ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన 155 గృహాల నిర్మాణాల ను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. భోరజ్‌, బజార్‌హత్నూర్‌ మండలాల్లోని గిరి జన ఆవాసాల్లో మంజూరైన మౌలిక వసతుల పనులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని అధికారుల ను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, గృహనిర్మాణ శాఖ పీడీ శంకర్‌, డీఈ షాకీర్‌,ఈడీఎం రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement