కోదండ రామయ్యకు ఆభరణాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

కోదండ రామయ్యకు ఆభరణాల సమర్పణ

Jul 18 2026 9:33 AM | Updated on Jul 18 2026 9:33 AM

ఒంగోలు మెట్రో: బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలో ఒంగోలు ఘడియారంవారి వీధిలో వేంచేసియున్న అనంత కోదండరామస్వామి దేవస్థానానికి శుక్రవారం దాతలు ఆభరణాలు సమర్పించారు. అక్కరాజు శ్రీరామమూర్తి ధర్మపత్ని సుశీలమ్మ జ్ఞాపకార్థం వారి ఇద్దరు కుమారులు వెంకట శివకుమార్‌, ఉమాదేవి దంపతులు, శేషాచలపతి, హేమనళిని దంపతులు, అల్లుడు, కుమార్తె దేవులపల్లి రాజా వెంకట చలపతిరావు, సావిత్రి దంపతులు రూ.71,000 విలువైన 108 స్వర్ణ తాపడ రజిత పుష్పాలు, చిన్న వెండి పళ్లెం, చిన్న వెండి గంగాళం అందజేశారు. ఆలయ ధర్మకర్త ఘడియారం సుబ్బయ్యశర్మకు వాటిని అందించారు. అమ్మవార్ల శేష వస్త్రాలను, సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి చిత్రపటాలను వారికి సుబ్బయ్య శర్మ స్వామి అందజేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు సీవీఎల్‌ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు మద్దులూరి హరిప్రేమనాథ్‌, కార్యదర్శి మహంకాళి శేషయ్య, కోశాధికారి పూర్ణచంద్రరావు, సహాయ కార్యదర్శి ఆదిపూడి గిరిజ శంకర శాండిల్య, కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయికుమార్‌, శనగవరపు శివకుమార్‌, కాళహస్తి దేవస్థానం సభ్యురాలు, బ్రాహ్మణ మహిళా నాయకురాలు కామరాజుగడ్డ కుసుమకుమారి, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement