ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాఠశాల క్రీడాకారుడు ఎం.హనుమంతు కిడ్స్ జావెలిన్‌త్రోలో స్వర్ణ పతకంతో మెరిశాడు. అలాగే కే.జగన్ లాంగ్ జంప్‌లో రజత పతకంతో సత్తా చాటిన ట్లు కోచ్ రమేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాపాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలవడంపై డీవైఎస్‌వో దయానందరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, డీటీఎస్‌వో పార్థసారథి అభినందించారు.


