విన్నపాలు.. ఎన్నిసార్లు | - | Sakshi
Sakshi News home page

విన్నపాలు.. ఎన్నిసార్లు

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

● ప్రస్తుతంహైదరాబాద్‌ –నిజామాబాద్‌ –ముథ్కెడ్‌ –ఆదిలాబాద్‌ మీదుగా వెళ్తున్న రైల్వేలైన్‌ వల్ల ఆదిలాబాద్‌ ప్రాంతవాసులు అనవసరంగా 120 కి.మీ. చుట్టూ తిరగాల్సి వస్తోంది. ● ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ లైన్‌ నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణలోని దాదాపు 7లక్షల మందిని రైల్వేసేవలు ప్రభావితం చేస్తాయి. ● ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ ప్రాంత రైతులు పండించే పత్తి, సోయాబీన్‌, ఎర్రజొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు తదితర పంటలకు ఉత్తర భారతం రైల్వేలింక్‌ వల్ల మార్కెట్‌ లభిస్తుంది. ● ప్రస్తుతం కాజీపేట –మంచిర్యాల –బల్లర్షా మీదుగా సాగుతున్న గ్రాండ్‌ట్రంక్‌ రైల్వేలైన్‌ వందశాతం సామర్థ్యానికి మించి పనిచేస్తోంది. సరుకు రవాణాకు తరచూ ఇబ్బంది ఏర్పడుతోంది. ఆర్మూర్‌ –నిర్మల్‌ మీదుగా ఆదిలాబాద్‌ –నాగపూర్‌లైన్‌కు కలిపితే ఉత్తర –దక్షిణ ప్రాంతాల మధ్య గ్రాండ్‌ట్రంక్‌కు మరో ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. ● నిర్మల్‌, ఆదిలాబాద్‌, నాగపూర్‌ల మీదుగా హైదరాబాద్‌ –ఢిల్లీ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 4గంటల వరకు తగ్గిస్తుంది. ● ప్రధానమార్గంగా ఉన్న ఎన్‌.హెచ్‌ 44పైనా సరుకు రవాణా వాహనాల రద్దీని తగ్గించడానికి ఈ రైల్వేలైన్‌ ఉపయోగపడుతుంది.

ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ కోసం ఎదురుచూపులు కేంద్రానికి పలుమార్లు ప్రజాప్రతినిధుల వినతులు రైల్వేబోర్డు వద్ద వెయిటింగ్‌లో ఫైలు

జాయింట్‌ వెంచర్‌ కోసం..

24, జనవరి 2017న ఎంపీ గోడం నగేశ్‌, అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు అప్పటి కేంద్ర రైల్వేమంత్రి సురేశ్‌ప్రభును ఢిల్లీలో కలిసి కేంద్రం –రాష్ట్రం కలిసి జాయింట్‌వెంచర్‌గానైనా రైల్వేలైన్‌ నిర్మించాలని కేంద్రానికి విన్నవించారు. ఈ ప్రయత్నం కనీసం ఎంఓయూకు కూడా నోచుకోలేదు.

ఎంపీ భేటీలకు ‘లెక్కనే లేదు’..

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ కోసం ఎంపీ గోడం నగేశ్‌ కేంద్రమంత్రులు, రైల్వేబోర్డు అధికారులను లెక్కలేనన్ని సార్లు కలిశారు. తాజాగా జూన్‌ 23న రైల్వేబోర్డు చైర్మన్‌ సతీశ్‌కుమార్‌ను కలిసి డీపీఆర్‌ ఆమోదించి రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు.

మంత్రికి వివరించారు..

ఈ ఏడాది మార్చి 30న వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు, జిల్లావాసి సిర్గాపూర్‌ నిరంజన్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిశారు. ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ అవసరాన్ని మంత్రికి అర్థమయ్యేలా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అయినా ఫైల్‌ కదలడం లేదు.

నిర్మల్‌: ‘అరె.. దేశంల ఎన్నో కొత్తకొత్త రైల్వేలైన్లేస్తున్నరు. కొత్త రైళ్లూ తెస్తున్నరు. ఒకటా రెండా నాలు గు దశాబ్ధాలుగా అడుగుతున్న నిర్మల్‌ –ఆదిలాబాద్‌ లైన్‌ మాత్రం ఏస్తలేరు. గట్టిగ అంటే 130 –140 కి.మీ. అంతే. ఈ మాత్రం పట్టాలెయ్యడానికి నాలు గుతరాలు ఎదురుచూడాల్న..! ఎన్నిసార్లు జిల్లాకెళ్లి ఢిల్లీ దాకా మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పోయి మొరపెట్టుకోవాలె..! ఎన్నిసార్లు ఈ లైన్‌ ఆవశ్యకత ఏందో వారికి వివరించాలె..! అసలు.. కేంద్రానికి ఈ ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ ఎయ్యాలన్న ఉద్దేశం ఉందా..!’ అని నిర్మల్‌ – ఆదిలాబాద్‌ జిల్లాల ప్రజలు విరక్తి చెందుతున్నారు. ‘ఇక జిల్లా మీదుగా రైలు..’అంటూ వినీవినీ విసుగు చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు ఇంకెన్నిసార్లు విన్నపాలు వినిపిస్తారు.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

రైల్వేబోర్డు దగ్గర..

దక్షిణమధ్య రైల్వే 136.50 కిలోమీటర్ల ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ లైన్‌ నిర్మాణానికి రూ.4,300కోట్ల అంచనాతో గత ఏడాది డిటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌(డీపీఆర్‌) పూర్తి చేసింది. సోన్‌ వద్ద గోదావరిపై బ్రిడ్జితో పాటు ఘాట్‌రోడ్లలో ఎనిమిది చోట్ల టన్నెళ్ల నిర్మాణాలను చేపట్టాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇప్పటికే రైల్వేశాఖను దాటుకుని రైల్వేబోర్డు దగ్గర ఆగింది. రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే దాదాపుగా ఫైనాన్షియల్‌ క్లియరెన్స్‌ వచ్చేస్తుంది. కానీ.. రైల్వేబోర్డు పెడుతున్న కొర్రీలతోనే జాప్యమవుతున్నట్లు తెలుస్తోంది.

రైల్వేలైన్‌ ఎందుకంటే..

తాజాగా ‘ఏలేటి’..

ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేౖలైన్‌కు ఇప్పటికై నా మోక్షం కల్పించాలంటూ బీజేఎల్పీనేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తాజాగా మరోసారి కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు విన్నవించారు. హైదరాబాద్‌ పర్యటనకు శనివారం వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గతంలోనూ పలుమార్లు ఢిల్లీదాకా వెళ్లి కలిసి అభ్యర్థించారు.

చేపట్టాల్సిన రైల్వేలైన్‌ వివరాలు..

రైల్వేలైన్‌ : ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌

లబ్ధిపొందే డివిజన్లు : ఆర్మూర్‌, నిర్మల్‌, భైంసా, ఉట్నూర్‌, ఆదిలాబాద్‌

లబ్ధిపొందే ప్రజలు : దాదాపు 7లక్షలు

లైన్‌ నిర్మాణ అంచనా : రూ.4,300 కోట్లు

లైన్‌ నిర్మాణ దూరం : 136.50 కిలోమీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement