ఆదిలాబాద్: రైతు సమస్యలపై ప్రతీ కార్యకర్త దృష్టి సారించి, పోరాటాలకు సిద్ధం కావాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఈ పథకం అమలులో జరుగుతున్న నిర్లక్ష్యంపై కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, నాయకులు రాజు, నగేశ్, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.


