ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ జూనియర్, సబ్‌జూనియర్ జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. మండలంలోని చాందా(టి)శివారులో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవి, కార్యదర్శి కొమ్ము కృష్ణ ప్రారంభించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈనెల 18, 19తేదీల్లో హైదరా బాద్‌లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటా రని పేర్కొన్నారు. ఎంపికై న వారిలో చరణ్‌తే జ్, మనిక్రిష్ సాత్విక్, మనీరెడ్డి, శర్వాన్స్ యా దవ్, సమృద్ధి, సుశాంత్‌యాదవ్, సాయి, శివంసాయి, డియాన్సీ, వాణిశ్రీ,, సాత్విక్, జే అమోఘక్, అనిరుద్, శౌర్యరెడ్డి, ఫ్యాన్‌వి, అద్విత ఉ న్నారు. ఇందులో ఆదిత్య కండేష్కర్, శ్రీనివా స్ గౌడ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.


