● జొన్న రైతులకు పంట అమ్మిన డబ్బుల్లో మైనస్‌ ● 50కిలోల నుంచి క్వింటాలు వరకు తక్కువగా ఖాతాల్లో జమ ● ప్రశ్నిస్తున్న రైతులు.. దాటవేస్తున్న మార్క్‌ఫెడ్‌, సొసైటీలు | - | Sakshi
Sakshi News home page

● జొన్న రైతులకు పంట అమ్మిన డబ్బుల్లో మైనస్‌ ● 50కిలోల నుంచి క్వింటాలు వరకు తక్కువగా ఖాతాల్లో జమ ● ప్రశ్నిస్తున్న రైతులు.. దాటవేస్తున్న మార్క్‌ఫెడ్‌, సొసైటీలు

Jul 6 2026 11:57 PM | Updated on Jul 6 2026 11:57 PM

● జొన్న రైతులకు పంట అమ్మిన డబ్బుల్లో మైనస్‌ ● 50కిలోల నుంచి క్వింటాలు వరకు తక్కువగా ఖాతాల్లో జమ ● ప్రశ్నిస్తున్న రైతులు.. దాటవేస్తున్న మార్క్‌ఫెడ్‌, సొసైటీలు

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో జొన్న పంట సాగు చేసిన రైతులు చేతికొచ్చిన దిగుబడిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో జ మ అవుతున్నాయి. అయితే ఇందులో కొందరికి అర క్వింటాలు.. మరికొందరికి క్వింటాలు.. జొన్నలకు సంబంధించిన డబ్బుల్లో కోత విధించారు. ఒ క్కో గ్రామంలో 15 నుంచి 20 మంది, అంతకంటే ఎక్కువ మంది రైతులకు ఇలాగే చేశారు. ఇదేమని సొసైటీలో అడిగితే మార్క్‌ఫెడ్‌ నుంచే ఆ కోత పెట్టి న డబ్బులు జమ చేస్తారని చెబుతున్నారు. ఈ విషయంలో మార్క్‌ఫెడ్‌ అధికారులను అడిగితే.. తూ కంలో తేడా వచ్చిందని, విషయాన్ని సొసైటీలకు తెలియజేశామని చెబుతున్నారు. ఆ తేడా వచ్చిన డబ్బులను సొసైటీ వారే రైతులకు చెల్లిస్తారని పేర్కొంటున్నారు. ఇలా ఆ కోత డబ్బుల విషయంలో దాటవేస్తూ రైతుకు నష్టం చేకూర్చుతున్నారు.

సొసైటీ వాళ్లే చెల్లిస్తారు

సొసైటీ నుంచి తూకం చేసి పంపిన జొన్నల బరువులో తేడా రావడంతో ఈ సమస్య ఏర్పడింది. కొంత మంది రైతులకు మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. సొసైటీ వాళ్లతో మాట్లాడటం జరిగింది. వారు రైతులకు చెల్లిస్తారు. పెండింగ్‌ బకాయిలు ఒకట్రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

– మహేశ్‌కుమార్‌, డీఎం మార్క్‌ఫెడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement