పిడుగుల దడ! | - | Sakshi
Sakshi News home page

పిడుగుల దడ!

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

● జూన్‌ నుంచి సెప్టెంబర్‌ దాకా పొంచి ఉన్న ముప్పు ● ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న మరణాలు ● అవగాహన, అప్రమత్తత లేక బాధితులకు తీరని నష్టం ● జాగ్రత్తలు, సూచనలు పాటిస్తేనే రక్షణ ● ఈనెల 5న నిర్మ ల్‌ జిల్లా కుంటాలకు చెందిన పశువుల కాపరి న్యాకపు సుధాకర్‌(74) వెంకూ రు శివారులో పశువులు మేపుతుండగా, వర్షం రావడంతో మా మిడి చెట్టు కిందకు వెళ్లాడు. చెట్టుపై పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. ● గత నెల 31న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం చెలిమల కొలంగూడకు చెందిన టేకంభీం(50) భార్య రాజుబాయి(45) రెబ్బె న మండలం కై రిగూడ సమీపంలో వ్యవసాయ పనుల్లో ఉండగా పిడుగు పడి చనిపోయారు. అదే రోజు ఆసిఫాబాద్‌ మండలం కౌట గూడకు చెందిన పెందూరు లింగు(50) పత్తి కట్టెలు ఏరుతుండగా వర్షానికి చెట్టు కిందకు వెళ్లగా పిడుగుపాటుకు మరణించాడు. ● గతేడాది జూన్‌12న ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం పిప్రిలో నలుగురు, బేల మండలం సాంగిడిలో ఇద్దరు వ్యవసాయ పనుల్లో ఉండగా, పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు. ● గతేడాది సెప్టెంబర్‌ 9న మంచిర్యాల జిల్లా పాత బెల్లంపల్లికి చెందిన గెల్లె పద్మ(43) పత్తి చేనులో కలుపు తీస్తుండగా మృత్యువాత పడింది. ● గతేడాది సెప్టెంబర్‌ 10న నిర్మల్‌ జిల్లా పెంబి మండలం నాగాపూర్‌కు చెందిన బండారి వెంకటి(50), భార్యాభర్తలు ఆలకుంట ఎల్లయ్య(37), లక్ష్మి(32) గుమ్మెనఎంగ్లాపూర్‌ శివారులో పత్తి చేనులో ఉండగా వర్షం పడింది. మంచె వద్దకు వెళ్లగా, ఉరుములు మెరుపులతో పిడుగుపడి ముగ్గురూ మృత్యువాత పడ్డారు. ● చాలా సార్లు చెట్ల కిందకు వెళ్లి పిడుగుపాటుకు గురవుతున్నారు. ఉరుములు మెరుపులు కని పిస్తే చెట్ల కింది నుంచి వచ్చేయాలి. ● ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్లు, ఎత్తయిన కొండలు, విద్యుత్‌ స్తంభాలు, నీటి ప్రవాహాలు ఉన్నచోట్ల ఉండకూడదు. ఒకేచోట ఎక్కువ మంది గూ మిగూడకూడదు. ● వర్షం పడే సమయంలో వీలైనంత వరకు ఇళ్లలో నే ఉండాలి. కిటికీలు, తలుపులు మూసేయాలి. ఎలక్ట్రానిక్‌ వస్తువులకు దూరంగా ఉండాలి. ● పిడుగుపాటుకు గురైన బాధితుడికి వెంటనే ప్రథ మ చికిత్స అందించాలి. ప్రాణాపాయం నుంచి బయట పడడం అరుదు.అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలి.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మె రుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకా లం ఆరంభం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్‌ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవా లు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. ఒక్కోసారి ఒకే కు టుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్‌ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది.

వానాకాలంలో తీవ్రత ఎక్కువ

ప్రధానంగా వానాకాలం సీజన్‌ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మే ఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్‌ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్ర యాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నా రు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నా యి. మరికొన్ని సమయాల్లో సెల్‌టవర్లు, విద్యుత్‌ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి.

‘దామిని’తో తప్పును ముప్పు

ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్‌ సమాచారాన్ని లోకల్‌ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్‌ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ‘దామిని’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్‌ చేసుకుంటే చదువురాని వారు సైతం సు లువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రో జు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

గాల్లో కలుస్తున్న ప్రాణాలు

జాగ్రత్తలే రక్ష

Advertisement
 
Advertisement
Advertisement