పూల షోయగం | - | Sakshi
Sakshi News home page

పూల షోయగం

Jan 7 2026 7:21 AM | Updated on Jan 7 2026 7:21 AM

పూల షోయగం

పూల షోయగం

యానాంలో ఆకట్టుకున్న ఫల, పుష్ప ప్రదర్శన

ప్రారంభించిన పుదుచ్చేరి మంత్రి కౌమార్‌

యానాం: డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటర్నేషనల్‌ ఇండోర్‌ స్టేడియం ఆవరణలోని బాలయోగి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మంగళవారం రాత్రి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 24వ ఫల, పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. పుదుచ్చేరి వ్యవసాయశాఖ మంత్రి సీడీజే కౌమార్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరు, పూణె, కడియం తదితర నర్సరీలతో పాటు యానాం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న వివిధ రకాల ఫల, పుష్పాలను ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా హంసరథం, దేవకన్య, ట్రైహార్ట్స్‌, పాండా, గిటార్‌, నెమలి తదితర ఆకృతులు ఆకట్టుకున్నాయి. యానాం పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన పుష్ప ప్రేమికులతో బాలయోగి క్రీడా మైదానం కిక్కిరిసి పోయింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఆర్‌ఏఒ, ఐఏఎస్‌ అధికారి అంకిత్‌ కుమార్‌, వ్యవసాయశాఖ డీడీ సీహెచ్‌ జోగిరాజు పాల్గొన్నారు.

ప్రదర్శనను తిలకిస్తున్న మల్లాడి కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement