ఓటు అభ్యంతరాలు @ 177
సిద్ధమవుతున్న ఓటర్ల జాబితా ఆర్‌వో, ఏఆర్‌వోల నియామకానికి కసరత్తు బ్యాలెట్ బాక్స్‌లు అందించాలని ఆదేశాలు
● నేటితో ముగియనున్న గడువు
కై లాస్‌నగర్: మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జా బితాపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల్లో 177 అందాయి. నేటితో గడువు ముగియనుంది. చివరి రోజు ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు ఈనెల 1న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పలు వార్డుల్లో ఓటర్ల వివరాలు తారుమారయ్యాయి. దీంతో పోటీ చేయాలనుకునే ఆశావహులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఓటర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడి జాబితాల్లో ఆయా వార్డులోని ఓట ర్ల వివరాలు పరిశీలిస్తున్నారు. తారుమారైన వా టిని సరి చేయాలని విజ్ఞప్తులు అందజేస్తున్నారు. తొలి రోజున 31 అభ్యంతరాలు అందగా, 2వ తేదీ న 81, 3న 65 అందాయి. నేటితో స్వీకరణ గడు వు ముగియనుంది. అనంతరం తుది జాబితా సి ద్ధం చేయనున్నారు. ఈక్రమంలో ఆదివారం సెల వు రోజయినప్పటికీ ప్రజల నుంచి అభ్యంతరా లు స్వీకరించారు. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.
ఎన్నికల కసరత్తులో నిమగ్నమైన బల్దియా సిబ్బంది
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఓటర్ల తుది జా బితా ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకా ల దిశగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రిటర్నింగ్, సహాయ రిట ర్నింగ్ అధికారులను నియమించేందుకు చర్యలు చే పడుతోంది. సోమవారం రాజకీయ పార్టీల ప్రతిని ధులతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితా వివరాలు వెల్లడించనున్నారు. ఎన్నికల నిర్వహణ కు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు మున్సిపల్ అధి కారులకు అందించాలంటూ పంచాయతీరా జ్ శాఖ కమిషనర్ ఆదేశించడంతో త్వరలోనే పుర నోటిఫికేషన్ రానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తుది జాబితాకు కసరత్తు..
జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీ అయిన ఆదిలాబాద్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓ టరు జాబితాను ఈ నెల 1న ప్రకటించారు. ఇందులో పలువార్డుల్లో ఓటర్ల వివరాలు తారుమారయ్యా యి. అధికారులు వాటిపై అభ్యంతరాలను స్వీకరి స్తున్నారు. వినతులు, ఫిర్యాదుల ఆధారంగా జా బితా సవరించే ప్రక్రియ చేపడుతున్నారు. ఆది వారం సెలవు రోజునప్పటికీ సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సోమవారం మున్సిపల్ కా ర్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో స మావేశం నిర్వహించి ఓటర్ల వివరాలు వెల్లడించనున్నారు. సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి సిద్ధం చేసిన తుది జాబి తాను ఈ నెల 10న ప్రకటించనున్నారు.
17 క్లస్టర్ల ఏర్పాటు..
మున్సిపల్ పరిధిలో 49 వార్డులున్నాయి. ఇందులో రెండు, మూడు వార్డులను కలిపి క్లస్టర్‌గా మొత్తం 17 ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో క్లస్టర్‌కు ఓ రిట ర్నింగ్ అధికారి చొప్పున 17మంది ఆర్‌వోలను నియమించనున్నారు. మరో ముగ్గురిని రిజర్వుగా ఎంపిక చేయనున్నారు. అలాగే క్లస్టర్‌కు నలుగురు చొప్పున 80మందిఏఆర్‌వోలను నియమించనున్నా రు. మరో 16 మందిని రిజ్వరుగా ఉంచనున్నారు. ఆర్‌వోలుగా పీజీహెచ్‌ఎంలు, ఏఆర్వోలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించేదిశగా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు. వీరితో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల తుది జాబితా విడుదలయ్యాక దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
బ్యాలెట్ బాక్స్‌లు అప్పగించండి
మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగనున్నాయి. దీంతో పట్టణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లను మున్సిపల్ అధికారులకు అప్పగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలకు 312 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమయ్యే అవకాశమున్నట్లుగా బల్దియా అధికారులు అంచానా వేస్తున్నారు. ఇందులో ఒక్కో వార్డుకు కనీసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బ్యాలెట్ బాక్స్ అవసరమేర్పడుతుంది. ఈ లెక్కన పట్టణానికి 260 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. 20 శాతం అదనంగా అంటే మరో 52 రిజర్వులో ఉంచనున్నారు.
పట్టణంలోని వార్డులు : 49
ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలు : 183
పట్టణంలోని ఓటర్లు :1,43,773
ఏర్పాట్లు చేస్తున్నాం..
ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తూ తుది జాబితా సిద్ధం చేసే ప్రక్రియ చేపడుతున్నాం. అలాగే ఆర్‌వో, ఏఆర్‌వోల నియామకంతో పాటు పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నాం. నోటిఫికేషన్ ప్రకటించే నాటికి అన్ని ఏర్పాట్లతో పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉంటాం.
– సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్


