కేంద్రం నిధులతోనే రైల్వే వంతెనల నిర్మాణం
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రైల్వే వంతెనల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆదివారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పట్టణంలో రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం పూర్తిస్థాయి నిధులు కేటాయించిందన్నారు. గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఈ వంతెనల నిర్మాణం ఆలస్యమైందన్నారు. ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తాము కృషి చేస్తుంటే, బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వారు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా ఆదిలాబాద్ ప్రగతికి తాము కట్టుబడి ఉంటామన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
తలమడుగు: సాగుకు చేసిన అప్పులుతీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని ఎంపీ నగేశ్ అన్నారు. మండలంలోని చెర్లపల్లిలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కనక యాదవ్‌రావు కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు గంగాధర్‌రావు, జీవీ రమణ, తదితరులున్నారు.
బ్రిడ్జి నిర్మించాలని వినతి
మండలంలోని దేవాపూర్, కమలాపూర్ గ్రామాల సమీపంలో పంటచేలకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరారు. ఈమేరకు ఎంపీ నగేశ్‌ను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సర్పంచ్ సంతోష్, తదితరులున్నారు.


